29-07-2025 02:22:39 AM
టీఎన్జీవో ఆధ్వర్యంలో సమావేశం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 28 (విజయక్రాంతి0: తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారమ్ జగదీష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేని (ముజీబ్) నేతృత్వంలో సోమవారం రాజీవ్‌గాంధీ హన్మంతు(ఐఏఎస్)తో సమావేశమై ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. యూనియన్, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులకు కేటాయించిన ఎన్నికల విధులను రద్దు చేయాలని కోరు తూ వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ విధులతో వారి ప్రాథమిక బాధ్యతలకు అంత రాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్స్ మరియు సీనియర్ అసి స్టెంట్స్ పదోన్నతులను త్వరగా పరిశీలించాలని, సకాలంలో వృత్తిపరమైన పురోగతి ఆవశ్యకతను నొక్కిచెప్పారు.
సస్పెండ్ చేయబడిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రాజీవ్ గాంధీ హన్మంతు అన్ని విషయాలపై త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి హైదరాబాద్ కురాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.