12-12-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిలో ఎస్‌ఐ మహేష్ కళ్యాణి, తిమ్మారెడ్డి, అన్నాసాగర్ గ్రామ ఓటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.గురువారం ఎల్లారెడ్డి మండలంలోని, అన్నాసాగర్ గ్రామంలో, సమావేశంలో మాట్లాడిన అధికారులు, ఎన్నికల సరళిపై గ్రామస్థులకు అవగాహన, సదస్సు, నిర్వహించారు.
ఈ అవగాహన సదస్సులో,ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఎంసీసీ నిబంధనలను కచ్చితంగా పాటించి, గ్రామంలో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటింగ్ జరిగేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. వ్యక్తిగత దూషణలు, ఇతర వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా, లేదా చట్ట వ్యతిరేక ప్రవర్తన కనపెట్టినా, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని స్పష్టంగా తెలియజేశారు.
ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలలో సెల్ఫోన్లకు అనుమతి ఉండదని ప్రజలకు తెలిపారు. పోలింగ్ కేంద్రం చుట్టూ ఉన్న 200 మీటర్ల పరిధిలో నివసించే వారు ఇతర వ్యక్తులు తమ ఇళ్ల వద్ద గుమికూడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఇలా పౌరుల సహకారంతో ఎన్నికలు శాంతియుతంగా జరగాలని పోలీసులు అభిలషించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి,ఏ ఎస్‌ఐ దేవగౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.