12-12-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 11, (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపా ల్వంచ రూరల్ పంచాయితీ రెండవ విడత ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం యం. పి రామసహాయం రఘురాం రెడ్డి గురువారం విస్క్రత ప్రచారం నిర్వహించారు. పంచాయి తి ఎన్నికల్లో భాగంగా పాల్వంచ మండలంలోని దంతెలబోర యస్సి కాలని, రంగాపు రం, నాగారం, సంగం, గంగదేవి గుప్పలో విస్క్రుత ప్రచారం చేసారు.
రెండవ విడతకు ప్రచారం రేపటి వరకు గడువు వున్నప్పటికి నేడు కాంగ్రేస్ పార్టీ అభ్యర్థును గెలిపించాలని, ఎన్నికల్లో గెలిస్తే అభివృద్ధి సాధ్యం అని తెలిపారు. ఆయన వెంట కొత్వాల శ్రీనివాసరావు, కొనేరు చిన్ని, జాలె జానకి రెడ్డి, య ర్రంశెట్టి ముత్తయ్య, బద్దె కిషోర్, బాలు నాయక్, రాము నాయక్, మాలు,, తులసీరాం,దూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.