12-12-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రైవర్ మృతి
ములకలపల్లి, డిసెంబర్ 11,(విజయ క్రాంతి): ములకలపల్లి మండలంలోని రాజుపేట కాలనీ సమీపంలో పాములేరు వంతెన వద్ద బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యాసిడ్ ట్యాంకర్ లారీ బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందా డు. ట్యాంకర్ లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోయారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ రహదారి ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవన్ కుమార్(35) అనే డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.
కొవ్వూరు నుంచి జగదల్పూర్ కు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ లారీ మండలంలోని రాజుపేట కాలనీ పాములేరు వాగు వంతెన వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. సమీప గ్రామస్తులు, పోలీసులు, ఫైర్ స్టేషన్ సిబ్బం ది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి క్యాబిన్ లో ప్రాణం కోల్పోయి ఇరుక్కుపోయి ఉన్న డ్రైవర్ను బయటకు తీశారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ములకలపల్లి ఎస్‌ఐ మధు ప్రసాద్ గురువారం తెలిపారు.