calender_icon.png 5 December, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి

05-12-2025 01:46:55 AM

డీఎస్పీ ప్రసన్నకుమార్

నూతనకల్, డిసెంబర్ 4: స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలోని ఓటర్లను ప్రలోభ పెట్టడం, భయపెట్టడం చేయకూడదని సూచించారు.

స్థానిక సంస్థలు ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సీఐ నరసింహారావు ఎస్త్స్ర నాగరాజు తహసిల్దార్ శ్రీనివాసరావు ఎంపీడీవో సునీత ఆయా గ్రామాల ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థులు తదితరులు ఉన్నారు.