calender_icon.png 5 December, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్గుట్టను ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా

05-12-2025 01:46:42 AM

మున్సిపల్ అధ్యక్షులు బి. శ్రీనివాస్ గౌడ్

చేవెళ్ల, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో పల్గుట్ట వార్డును అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పల్గుట్ట వార్డులో  రూ.40లక్షలతో సీసీ రోడ్డు పనులు, రూ. 5 లక్షలతో వీధి దీపాలను గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మున్సిపల్ వార్డులో  నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాల్గారి జనార్దన్ రెడ్డి గారి సహకారంతో పరిష్కరించి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

వార్డులోని ప్రతి కాలనీలో అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్డు పనులకు మరిన్ని నిధులు మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే  ఎమ్మెల్యేతో నిధులు మంజూరు చేయిస్తామన్నారు. సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలియజేశారు. 

చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ రామ్ రెడ్డి, వాసు దేవ్ రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ G బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ లు నడిపెల్లి నర్సింలు, మాజీ సర్పంచ్  నారాయణ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్గారి కార్తీక్ రెడ్డి, నారాయణ గౌడ్, మాజీ ఉప సర్పంచ్‌లు బుల్కాపురం  నరసింహారెడ్డి, గుడెపు రంగారెడ్డి,  దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు పుల్లగుర్లబుచ్చిరెడ్డి, మాల్గారి రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కేశపల్లి శేఖర్ రెడ్డి, పందిరి రాఘవేందర్, నడిపెల్లి శ్రీశైలం, R వెంకట్ రెడ్డి, గంగిడి మధుసూదన్ రెడ్డి, కేశపల్లి నర్సింహా రెడ్డి,  కేశపల్లి చంద్రశేఖర్ రెడ్డి, బండారు బాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.