19 July, 2026 | 2:14 AM

ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి

19-07-2026 12:00 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, జూలై 18 (విజయక్రాంతి):  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎస్‌ఐర్ పాల్గొని ఓటర్ నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఈ మేరకు శనివారం భోలక్ పూర్ డివిజన్ లోని పీ అండ్ టీ కాలనీలో బీఎల్ వోలతో కలిసి భర్తీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాలన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు పార్టీ నాయకులు, బీఎల్ వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను గుర్తించి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను భర్తీ చేసి వారి నుంచి తీసుకోవాలని కోరారు. ఆగస్టు 3వ తేదీలోపు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసి నిజమైన ఓటర్ లు ఓటర్ జాబితాలో ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతా యుతంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, పీ అండ్ టీ కాలనీ కార్యదర్శి లత, నాయకులు ప్రవీణ్, కె.ఎం సాయి, ఎల్లేష్, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.