19 July, 2026 | 2:15 AM

కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది

19-07-2026 12:00 AM

మన్నె గోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్, జూలై 18 (విజయక్రాంతి): యూత్ డిక్లరేషన్ పేరిట యువతను కాంగ్రెస్ పా ర్టీ నమ్మించి మోసం చేసిందని బిఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవ ర్ధన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన యువ సంగ్రామ సదస్సుకు ఆయన హాజరైనట్లు తెలిపారు. ఈ విషయమై గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువత పక్షాన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో తాము పోరాడుతున్నామన్నారు.ఉద్యోగాలు,నిరుద్యోగ భృతి, నియామకాలు, విద్యార్థి సంక్షేమం వంటి హామీలనిచ్చి కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిందన్నారు. కానీ అధికారం చేపట్టిన తరువాత ఇచ్చిన హామీలను విస్మరిస్తూ మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ యువత భవిష్యత్తును అంధ కారంలోకి నెట్టుతోందని విమర్శించారు. యువత జీవితాలతో రాజకీయం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించరని కుండబద్ధలుగొట్టారు.ఇచ్చిన హామీలు నెరవేర్చి యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేవరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ డివిజన్ బీఆర్‌ఎస్ నాయకుడు వెంకీ ముదిరాజ్, ఎర్రమంజిల్ డివిజన్ సీనియర్ నాయకుడు నిశాంత్ ముదిరాజ్, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులు నవీన్ నాయక్, ఖైరతాబాద్ డివిజన్ నాయకుడు శ్రావణ్, నిరుద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.