19 July, 2026 | 2:14 AM

నేడు విద్యుత్‌లో అంతరాయం

19-07-2026 12:00 AM

సికింద్రాబాద్, జూలై ౧౮ : ఉజ్జయిని మహంకాళి ఆషాడ జాతర (లష్కర్ బోనాల పండుగ- 2026)  సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా కోసం చేసే పనుల్లో భాగంగా నేడు ఆదివారం  ఉదయం 10 గంలల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ బాటనీ స్కూల్ ఫీడర్ పరిధిలోని విద్యుత్ లైన్ల మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ ఏబీ స్విచ్‌ల రిపేర్లు, విద్యుత్ లైన్లపై చెట్లకొమ్మల తొలగింపు కోసం విద్యుత్‌లో అంతరాయం ఉంటుందని టీజీ ఎస్‌పీడీసీఎల్ ఆపరేషన్ ఏఈ కాసం రవికుమార్ ఒక ప్రకటనలో  తెలిపారు.

బాటనీ స్కూల్ ఏరియా, ఘాస్‌మండీ, రాణీగంజ్, లారీ అడ్డా, మిట్టల్ ఛాంబర్, పాన్ బజార్ ఏరియా, లాలాగుడి, బాంబే హోటల్, పద్మావతి బ్యాంక్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ ఎంజీ ఫీడర్ పరిధిలో మరమ్మతు కారణంగా ఎంజీ రోడ్, సుభాష్ రోడ్, జైన్ టెంపుల్, కంచుబొమ్మ ఏరియా తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.