calender_icon.png 2 May, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే

02-05-2025 12:49:10 AM

రాజాపూర్ మే 1:  పదవ తరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించిన మండల విద్యార్థులను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అభినందించారు. ప్రథమ స్థానంలో నిలిచినిన విద్యార్థులకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజాపూర్ ఎంఇఓ సుధాకర్ ఆధ్వర్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విద్యార్థులను సన్మానించి అభినదిందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, విద్య ద్వారానే మంచి జీవితం లభిస్తుందని తెలిపారు. కేజీబివి విద్యార్థి హంసిక, ఓం కుమారి, మండల స్థాయిలో జస్వంత్ జ్యోతి,అనూష ,నందిని,గీతికా ఉత్తమ  మార్కులను సొంతం చేసుకున్నాను. ఈ కార్యక్రమంలో ఎంఇఓ అనిశెట్టి సుధాకర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావ్, ఉపాధ్యాయులు కృష్ణవేణి, సతీష్ రాథోడ్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.