15 April, 2026 | 3:16 AM

అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి

15-04-2026 12:00 AM

కామారెడ్డి, ఏప్రిల్ 14, (విజయక్రాంతి) : అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు అనుసరించాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు ఘనంగా పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు, మాజీ సిడిసి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు  ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,గోనే శ్రీనివాస్, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు అన్వర్, హైమత్, అంజద్, సిద్ధిక్ లడ్డు.గోసంగి సత్యం, కాళ్ల గణేష్, వహీద్, సోమన్న గారి రాజు, లక్కపతిని గంగాధర్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.