అంబేద్కర్ ఆశయ సాధనతో ముందుకు వెళ్తాం
మంథనిలో అంబేద్కర్ జయంతిలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
మంథని, ఏప్రిల్ 14(విజయక్రాంతి): భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కొరకు నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్తామని కేవలం దళితులకు సంబంధించిన వారే కాదు అని, అన్ని వర్గాలకు అన్ని కులాలకు సంబంధించినటు వంటి వారు అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రతినిత్యం అంబేద్కర్ రచించినటువంటి రా జ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా ముందుకు పోవాలని తెలుపుతు న్నారన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరికీ మేలు జరగాలి అందరు బాగుండాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి బడుగు బలహీన వర్గాలకు ఇం డ్లు ఇచ్చే కార్యక్రమం ముందుకు తీసుకు వె ళ్తున్నాం అన్నారు.
మంథని పట్టణంలో అం బేద్కర్ పేరు మీద పోటీ పరీక్షలకు సన్నధమయ్యే వారి కోసం మంథనిలో బిఆర్ అం బేద్కర్ స్టడీ సర్కిల్ పెట్టడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నియోజకవర్గ కేంద్రాలలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోటీ పరీక్షలకు సమర్థమయ్య విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కలిగిన అధ్యాపకులతో విద్యాబోధనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంబేద్కర్ చూపించిన సిద్ధాంతాలను ముం దుకు తీసుకెళ్తామని వారి ఆశయం సాధనలో తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మ న్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సయేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొండా శంకర్, ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సెల్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






