2 September, 2026 | 8:36 PM

Breaking News

రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •  

ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో పయనించాలి

27-11-2024 | 09:06am

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 

దౌల్తాబాద్, విజయక్రాంతి: ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో పయనించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆంజనేయ సహిత శివపంచాయతన నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభయానికి మారుపేరుగా నిలిచే ఆంజనేయస్వామి ఆరోగ్య దైవమని అన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో  ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీముద్దీన్, నియోజకవర్గ బీసీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆంజనేయులు గౌడ్, చంద్రారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.