calender_icon.png 7 May, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనమెత్తిన జోగిని శ్యామల

27-11-2024 09:09:48 AM

చేర్యాల: జనగామ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన స్వగ్రామమైన మద్దూరు మండలం నర్సాయపల్లిలో ఎల్లమ్మ జమదగ్ని కల్యాణోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ పండుగ కోసం ప్రత్యేకంగా హైదరాబాదు నుండి జోగిని శ్యామలను రప్పించి, ఎల్లమ్మ తల్లికి మౌనమెత్తించారు. జోగిని శ్యామల బోనమెత్తుకొని గ్రామంలోని గ్రామదేవతకు బోనం సమర్పించారు. ఎప్పుడు పట్నంలో జరిగే  బోనాల పండుగకు బోనం ఎత్తే శ్యామల, పల్లెటూరికి వచ్చి బోనం ఎత్తుకోవడంతో  గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.