1 April, 2026 | 3:31 AM

కౌశిక్‌రెడ్డికి సీఐడీ నోటీసులు

01-04-2026 01:10 AM

కరీంనగర్ సీపీ గౌష్ ఆలంపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జారీ

4న హైదరాబాద్ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (విజయక్రాంతి): హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయనకు ఈ నోటీసులు అందాయి. ఈ నెల 4న హైదరాబాద్ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని లేఖలో పేర్కొన్నారు. ఈ నోటీసులపై కౌశిక్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే అక్కసుతోనే తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని, ఎన్ని నోటీసు లు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా వెన క్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పా రు. ఈ ఏడాది జనవరి 29న సమ్మక్క సార క్క జాతర సందర్భంగా జరిగిన ఓ గొడవలో కరీంనగర్ సీపీ గౌష్ ఆలంను ఉద్దేశిం చి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై అప్పట్లో కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా.. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ కేసు ద ర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.