calender_icon.png 22 September, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరన్నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధం!

22-09-2025 12:16:34 AM

  1. ఏడుపాయల్లో నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 

పది రోజులపాటు ఆధ్యాత్మిక శోభ

ఉత్సవాలకు ముస్తాబైన గోకుల్ షెడ్

29న వనదుర్గామాతకు ఘనంగా బోనాలు 

అక్టోబర్ 1న సుహాసిని పూజ, చండీ హోమం 

పాపన్నపేట, సెప్టెంబర్ 21 :మంజీరా ఏ డు పాయలుగా చీలి ప్రవహించే ప్రాంతం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మం డలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో సోమవారం నుంచి శరన్నవ రాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహ ణాధికారి చంద్రశేఖర్, అర్చకులు తెలిపారు.

ఆలయ ఆవరణలో ఉన్న గోకుల్ షెడ్ లో ఉ త్సవాలు నిర్వహించేందుకు షెడ్డును సర్వాం గ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం ఉదయమే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రో హిత్ రావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారం భించనున్నారు.

మొదటి రోజైనా సోమవారం పాడ్యమి ని పురస్కరించుకొని బాల త్రిపుర సుందరి దేవి (ముదురు పసుపు) రూపంలో దర్శనమిస్తుందని, 23న గాయత్రీ దేవిగా (గులాబీ), 24న అన్నపూర్ణాదేవిగా (నీలం), 25న వనదుర్గాదేవిగా (ఆకుపచ్చ), 26న మహాలక్ష్మి దేవిగా (పెసర), 27న లలితా త్రిపుర సుందరి దేవిగా (ముదురు నీలం), 28న మ హా చండి దేవిగా (నారింజ), 29న సరస్వతీ దేవిగా (తెలుపు),

30న దుర్గా దేవిగా (ఎరుపు), అక్టోబర్ 1న మహిషాసుర మర్దిని దేవిగా (మెరూన్), చివరి రోజు 2న విజయదశమిని పురస్కరించుకొని రాజరాజేశ్వరి దే విగా (పసుపు) వనదుర్గమ్మ దర్శనం ఇస్తారని వారు తెలిపారు. ప్రతిరోజు ప్రాతఃకాల సమయాన అమ్మవారికి అభిషేకం, ఉద యం విఘ్నేశ్వర పూజ తదితరాలు నిర్వహిస్తామని తెలిపారు. 29న వన దుర్గామా తకు అంగరంగ వైభవంగా బోనాలు, అక్టోబర్ 1న సుహాసిని పూజ, చండీ హోమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

దేవి శరన్నవరాత్రి ఉ త్సవాల్లో భాగంగా వనదుర్గా అన్నదాన సే వా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్న ప్ర సాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్న ట్లు వారు పేర్కొన్నారు. భక్తులు ఇట్టి కార్యక్రమాలకు అధిక సంఖ్యలో పాల్గొని వనదుర్గా మాత కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.