28 March, 2026 | 4:00 AM

ఐపీఎల్ కార్నివాల్

28-03-2026 01:49 AM

ధనాధన్ వినోదానికి అంతా రెడీ

ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ మధ్య ఆరంభ మ్యాచ్

ఆరంభం వేడుకలు రద్దు

ఐపీఎల్... ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్... స్వదేశీ, విదేశీ స్టార్ క్రికెటర్లతో అభిమానులకు టీ20 వినోదాన్ని అందించే లీగ్... ఈ సారి మరింత కొత్తగా ముస్తాబైంది. ....10 జట్ల మధ్య హోరాహరీ క్రికెట్ యుధ్ధం.. బ్యాటర్ల సిక్సర్లు, బౌండరీల హోరు.. పేసర్ల పదునైన యార్కర్లు.. ఇక రెండు నెలల పాటు ప్రతీరోజూ సాయంత్రం ఫ్యాన్స్‌కు పండుగే.. మినీ వేలం తర్వాత మారిన జట్ల కూర్పు నేపథ్యంలో ఈ సారి ఐపీఎల్ కార్నివాల్ రసవత్తరంగా సాగడం ఖాయం...

బెంగళూరు, మార్చి 27 : టీ20 ప్రపంచకప్ తర్వాత మరో భారీ ఎంటర్ టైన్ మెంట్ క్రికెట్ అభిమానుల ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజ న్ శనివారం నుంచే మొదలు కాబోతోంది. ప్రతీరోజూ రాత్రి 7.30 అయిందంటే ఇక అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. టీ20 క్రికెట్‌లోనే అత్యంత క్రేజ్ ఉన్న ఐపీఎల్ వచ్చిందంటే చాలు రెం డు నెలల పాటు ఫ్యాన్స్‌కు క్రికెట్ వినోదమే. నిన్నటి వరకూ ఒకే జట్టులో ఆడిన ఆటగాళ్లందరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోతారు.

దేశాభిమానం కాస్తా నగరాల మధ్య క్రికెట్ సమరా లుగా మారుతుంది. స్వ దేశీ, విదేశీ టీ20 స్టా ర్లతో 10 జట్ల మధ్య మైదానంలో హోరాహోరీ యు ద్ధమే. గత సీజన్ల తో పోలిస్తే ఈసా రి చాలా జట్ల కూర్పులు మారాయి. మినీ వేలంలో ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయ ర్స్‌ను వదిలేసి కొత్తగా మరికొందరు ఆటగాళ్లను తీసుకున్నాయి.   గత సీజ న్‌లో వైఫల్యాన్ని మరిచిపోయి ఈ సారి చెలరేగేందుకు తమ కూర్పును మార్చుకున్న జట్లు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.

ఐపీఎల్ బ్రాండ్ ఏడాది ఏడాదికీ పెరుగుతూ వస్తోంది. 2008లో 8 జట్లతో మొదలైన లీగ్ 20 22 నుంచి 10 జట్ల కు విస్తరించారు. 60 మ్యాచ్‌లు కాస్తా ఇప్పుడు 74 మ్యాచ్‌లు అ య్యాయి. అటు లీగ్ బ్రాండ్ వాల్యూ నే కాదు ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ కూడా ఊ హించని విధంగా పెరిగింది. ఇటీవల ఆర్సీబీ, రాజ స్థాన్ రాయల్స్ ఫ్రాంచై జీల విక్రయించినప్పుడు వచ్చిన బిడ్డింగ్ ధర లే దీనికి ఉదాహరణ. అటు ఆటలోనూ సరికొత్త మార్పులు గత కొన్ని సీజన్లుగా ఫ్యాన్స్‌కు అసలు సిసలు వినోదాన్ని అందిస్తున్నాయి.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వంటిని ఆటను మ రింత రసవత్తరంగా మార్చేశాయి. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డి ఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోం ది. 17 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ కలను నెరవేర్చుకున్న ఆర్సీబీ ఈ సారి కూడా భారీ అంచనాలతో సిద్ధమైంది. అలాగే ఐపీఎల్ చరిత్రలో ఐదేసి టైటిల్స్‌తో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియ న్స్ , చెన్నై సూపర్ కింగ్స్ సిక్సర్ కొట్టేందుకు ఎదురుచూస్తున్నాయి. అలాగే గత సీజన్‌లో టైటిల్‌ను తృటిలో చేజార్చుకున్న పంజాబ్ కింగ్స్‌తో పాటు ఇప్పటి వరకూ ట్రోఫీని ముద్దాడని ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కీలక మార్పులతో కొత్త సీజన్‌కు సిద్ధమయ్యాయి.

గ్రూప్ ఏ : చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రా యల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్

గ్రూప్ బి : ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్