తొలి పంచ్ ఎవరిదో?
ఇవాళ ఆర్సీబీతో సన్‌రైజర్స్ ఢీ
చిన్నస్వామి స్టేడియంలో హైవోల్టేజ్ ఫైట్
బౌలింగ్‌లో బలహీనంగా హైదరాబాద్
బెంగళూరు, మార్చి 27: ఐపీఎల్ 2026 సీజన్ హై వోల్టేజ్ ఫైట్‌తో ఆరంభం కాబోతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలబడబోతున్నాయి. సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ హోంగ్రౌండ్‌లో ఫేవరెట్‌గా బ రిలోకి దిగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్‌ను అదిరిపోయే విజయంతో ఆరంభించాలసి భావిస్తోంది.
కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీకి ప్రధాన పేస్ బౌలర్ హ్యాజిల్ వుడ్ ఈ మ్యా చ్‌కు దూరమవడం ఎదురుదెబ్బగానే చెప్పా లి. అయితే మిగిలిన జట్టులో మాత్రం పలువురు కీలక ప్లేయర్లున్నారు. బ్యాటింగ్‌లో వి రాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనర్లుగా ఆడనున్నారు. గత సీజన్‌లో ఈ జోడీ పలు మెరు పు ఇన్నింగ్స్‌లతో అద్భుతమైన ఆరంభాలనిచ్చింది. ఆర్సీబీ టైటిల్ విజయంలో సాల్ట్ - కోహ్లీ జోడీ కీలకపాత్ర పోషించింది. దీంతో మరోసారి ఈ ఓపెనింగ్ జంటపై అంచనాలున్నాయి.
అలాగే కెప్టెన్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, జాకబ్ బెథల్ కూడా ఆర్సీబీ బ్యాటింగ్‌లో కీలకంగా ఉన్నారు. మిడిలార్డర్ లో జట్టు ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించేది వీరే. అటు చివర్లో ఫినిషర్లుగా టిమ్ డేవిడ్‌తో పాటు వికెట్ కీపర్ జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా దుమ్మురేపడం ఖాయం. ముఖ్యంగా జితేశ్ శర్మ గత సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌లు ముగించా డు. హోంగ్రౌండ్ లో పిచ్ కండీషన్స్‌ను ఉపయోగించుకోవడంలో జితేశ్ శర్మ ఆరితేరా డు. దీంతో ఆర్సీబీ ఫినిషర్‌గా జితేశ్ శర్మనే భావిస్తున్నారు.
మరోవైపు బౌలింగ్‌లో మాత్రం ఆర్సీబీ కాస్త వీక్‌గానే ఉంది. ఎందుకం టే హ్యాజిల్ వుడ్ ఇంకా ఫిట్ నెస్ సాధించకపోవడంతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యా డు. ఇప్పటికే యశ్ దయాల్, తుషారా కూడా ఈ సీజన్ కు అందుబాటులో లేరు. దీంతో పేస్ భారం భువనేశ్వర్ పైనే పడనుంది. స్పిన్ విభాగంలో సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా కీలకం కానున్నారు. ఇది లా ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వెంకటేశ్ అయ్యర్, సుయాశ్ శర్మలలో ఒకరిని బరిలోకి దించే అవకాశముంది.
మరోవైపు గత ఏడాది ఆశించిన ప్రదర్శన కనబరచలేకపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త సీజన్ ను ఘనవిజయంతో ఆరంభించాలని పట్టుదలగా ఉంది. ఆర్సీబీని వారి సొంతగడ్డపైనే ఓడించి తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోవాలని ఎదురుచూస్తోంది. ప్యాట్ కమి న్స్ జట్టుతో చేరినప్పటకీ ఇంకా ఫిట్ నెస్ సాధించలేదు. దీంతో తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ జట్టును నడిపించనున్నాడు. బ్యాటింగ్ పరంగా సన్ రైజర్స్ కు తిరుగులేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీని చూస్తే ప్రత్యర్థి బౌలర్లకు వణుకే.
గత సీజన్ లో వీరిద్దరూ ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడారో అభిమానులు మరిచిపోలేదు. అలాగే ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, లివింగ్ స్టోన్ లాంటి హిట్టర్లు కూడా సన్ రైజర్స్ కు అడ్వాంటేజ్. అందుకే ఈ సారి 300 ప్లస్ స్కోరు సాధిస్తుందంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే బౌలింగ్ లో మాత్రం సన్ రైజర్స్ బలహీనంగా మారింది. కమిన్స్ లేకపోవడంతో మ్యాచ్‌ను మలుపుతిప్పే బౌలర్లు ఎవ్వరూ జట్టులో కనిపించడం లేదు. ఉనాద్కట్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ ఎంతవరకూ ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేస్తారో చూడాలి.
పిచ్ రిపోర్ట్ :
చిన్నస్వామి స్టేడియం ఎప్పుడూ బ్యాటర్ల కే అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీలు, పిచ్ ఫ్లాట్ ఉండడంతో ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఛేజింగ్ జట్టుకు ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. పేసర్లు తెలివిగా బౌలింగ్ చేస్తే పై చేయి సాధిస్తారు. భారీస్కోర్లు నమోదవడం ఖాయం.
బెంగళూరు తుది జట్టు (అంచనా)
ఫిల్ సాల్ట్ , విరాట్ కోహ్లీ, పడిక్కల్, పటిదార్ (కెప్టెన్), బెథెల్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, డఫీ, రసిక్ దార్
ఇంపాక్ట్ ప్లేయర్స్ : వెంకటేశ్ అయ్యర్/సుయాశ్ శర్మ
హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కెప్టెన్), క్లాసెన్, లివింగ్ స్టోన్, నితీశ్ కు మార్ రెడ్డి , అనికేత్ వర్మ, హర్ష దూబే, ఉనాద్కట్. హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ
ఇంపాక్ట్ ప్లేయర్స్ : కమిందు మెండిస్/శివమ్ మావి




