28 March, 2026 | 4:19 AM

గ్రౌండ్ స్టాఫ్‌కు హార్థిక్ నజరానా

28-03-2026 01:45 AM

ముంబై, మార్చి 27: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హా ర్దిక్ పాండ్యా గొప్ప మనసు చాటుకున్నాడు. ముంబై వాంఖడే స్టేడియం గ్రౌండ్ స్టాఫ్‌కు నజరానా ఇచ్చాడు. 11 మంది గ్రౌండ్స్ మెన్ కు ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున చెక్కులు అందజేశాడు. తద్వారా కొన్ని నెలల క్రితం వారికి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు హార్దిక్ పాండ్యా.. వాంఖడే స్టేడియంలో తీవ్రంగా కష్టపడ్డాడు.

బౌలింగ్, బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు నెట్స్ లో గంటలకొద్దీ చెమటోడ్చా డు. ఆ సమయంలో అర్ధరాత్రి వరకు మైదానంలోనే గడి పేవాడు. హార్దిక్ ప్రాక్టీస్ కోసం అక్కడి గ్రౌండ్ స్టాఫ్ తమ విధులు ముగిసి నా కూడా అదనపు గంటలు వేచి ఉండి అతనికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చేవారు. ఆ సమయంలోనే హార్దిక్ వారందరికీ మంచి గిఫ్ట్ ఇస్తా నని చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలవడంతో పాటు హార్దిక్ పాండ్యా మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. తన ఎదుగుదలలో భాగ మైన సిబ్బందిని గుర్తుంచుకుని మరీ వారిని సత్కరించిన హార్దిక్ పాండ్యాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.