calender_icon.png 8 November, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ నిఘా ఉంటేనే ఎగ్జామ్ సెంటర్‌కు అనుమతి

08-11-2025 12:00:00 AM

-ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి

-ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ

కొల్లాపూర్ రూరల్, నవంబర్ 7: రాబోయే ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్దం చేయాలని ప్రతి పరీక్ష సెంటర్ కు తప్పనిసరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందేనని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గాయత్రి ఇంటర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్నారు. విద్యార్థులు శ్రద్ధ, ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ బోర్డు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.