calender_icon.png 8 November, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు అరెస్ట్

08-11-2025 12:00:00 AM

రిమాండ్ కు తరలింపు

కల్వకుర్తి, నవంబర్ 7: కల్వకుర్తి పురపాలక పరిధిలోని సంజాపూర్ లో బుధవారం జరిగిన అత్యాయత్నం కేసులొ ఐదు మంది నిందితులను  అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ తరలించినట్లు కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపారు. సంజపూర్ గ్రామానికి చెందిన గుర్రపు జంగయ్య, అతని భార్య అలివేలు, కొడుకు పరమేష్ లను చంపాలనే ఉద్దేశ్యంతో దాడి చేసిన ఆరు మంది నేరస్థులలో చెరుకూరు గ్రామానికి చెందిన దొడ్ల శివ , దొడ్ల ప్రశాంత్, వెల్దండకు చెందిన గంగాపురి రామకృష్ణ , సుభాష్, గుండ్ల నరేశ్ ను  అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్ చేసినట్లు తెలిపారు. గుండ్లపల్లి వెంకటేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి  2 బైకులు, 5 సెల్ ఫోన్ లు, దాడికి ఉపయోగించిన కర్రలు , గొడ్డలి పారను సీజ్ చేశామన్నారు.