calender_icon.png 8 November, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ

08-11-2025 12:02:49 PM

గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్లు వేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

రూ. 36 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణం

రాష్ట్ర చరిత్రలో రూ. 60,799 కోట్లతో రోడ్లు నిర్మాణం

హ్యామ్ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్లు వేస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పేర్కొన్నారు. హ్యామ్ ప్రాజెక్టుకు రూ. 11,399 కోట్లతో త్వరలో టెండర్లు ప్రకటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రూ. 60,799 కోట్లతో రోడ్లు నిర్మించడం రికార్డు అని కోమటిరెడ్డి అన్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(Hyderabad-Vijayawada National Highway) 8 లైన్లకు విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 10,400 కోట్లతో హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరించనున్నట్లు తెలిపారు. రూ. 36 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణం చేస్తామని చెప్పారు. నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.