08-11-2025 12:12:37 PM
దుండిగల్ : హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్(Dundigal Police Station) పరిధిలో తన ఇంట్లో శనివారం ఉదయం వివాహిత హత్యకు గురైంది. దుండిగల్‌లోని గ్రీన్ హిల్స్ కాలనీలోని ఒక ఇంట్లో బాధితురాలు స్వాతి(21)ని దుండగులు దారుణంగా గొంతు కోసి హతమార్చారు. మహిళ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.