08-11-2025 10:00:42 AM
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో( Shamshabad Airport) ప్రయాణికుల ఆందోళన చేస్తున్నారు. వియత్నాం ఎయిర్ లైన్స్(Vietnam Airlines)లో సాంకేతిక సమస్య వల్ల ప్రయాణికులు పడిగాపులు కాస్తు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్య వల్ల రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండే పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానం ఎప్పుడు వెళ్తుందో చెప్పకపోవడంతో 200 మంది ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే ఉన్నారు. వీఎన్-984 విమానం(VN-984 aircraft) నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వియత్నాం వెళ్లాల్సిఉంది.