పరీక్ష విధానాన్ని రద్దు చేయాలి
ఆశాల డిమాండ్, నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నిర్మల్, జూన్ 1౩ (విజయక్రాంతి)/ జగిత్యాల: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న తమకు నష్టం కలిగించే పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిర్మల్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్‌తో కలిసి ఆందోళన నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం ఇపుడు పరీక్ష పేరుతో ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. చాలీ చాలని వేతనాలతో పని చేస్తున్న తమపై ప్రభుత్వం పనిభారం పెండంతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లకు నష్టం కలిగించే పరీక్షను రద్దు చేసే వరకు అందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌వో భుజంగ్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు రాజమణి, విజయలక్ష్మి, రాణి, గంగామణి, సుజాత, చంద్రకళ, అనసూయ, ఇంద్రమాల, మంజుల, మౌనిక, కమల, సరిత, రాధ పాల్గొన్నారు.
జగిత్యాలలో
జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు గురువారం సీఐటీయూ జిల్లా కనీనర్ ఇందూరి సులోచనతో కలిసి ధర్నా నిరహించారు. ఎలాంటి రాత పరీక్షా లేకుండానే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్లు కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని ప్రభుతం నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా కనీనర్ ఇందూరి సులోచన కోరారు. నిరసన కార్యక్రమంలో ఆశ యూనియన్ అధ్యక్షురాలు ఆత్మకూరి లత, కార్యదరి మమత, జిల్లా కమిటీ సభ్యులు జీవలక్ష్మి, జ్యోతి, వసంత, సంధ్య, దివ్య, సరిత, రాణి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి నాయక్ పాల్గొన్నారు.






