18 July, 2026 | 6:07 PM

Breaking News

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •  

రెచ్చిపోయిన సత్నామీలు

11-06-2024 01:23 AM

ఛత్తీస్‌గఢ్‌లో ఎస్పీ ఆఫీస్‌కు నిప్పు

200 వాహనాలు ధ్వంసం

మత చిహ్నాలను ధ్వంసం చేయటంతో ఆందోళనబాట

న్యూఢిల్లీ, జూన్ 10: ఛత్తీస్‌గఢ్‌లో సత్నామీలు రెచ్చిపోయారు. సోమవారం వారు బలోడా బజార్‌లో నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో స్థానిక కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టి విధ్వంసం సృష్టించారు. పక్కనే ఉన్న ఎస్పీ కార్యాలయానికి నిప్పంటించారు. ఈ ఘటనలో తహసీల్దార్, జిల్లా పంచాయతీ కార్యాలయాలు కూడా దగ్ధమయ్యాయి. మే 15 తేదీలో సత్నామీలకు పరమ పవిత్రమైన అమర్ గుఫాను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వారి మత చిహ్నమైన జైత్కమ్‌ను అవమానపరిచారు.

దీంతో అప్పటి నుంచి వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తామని ఛత్తీస్‌గఢ్ డిఫ్యూటీ సీఎం విజయ్ శర్మ ప్రకటించారు. కానీ, అందుకు సత్నామీలు ఒప్పుకోలేదు. తమ మతాన్ని అవమానించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని  డి మాండ్ చేస్తున్నారు. సోమవారం దస రా మైదానంలో సమావేశమైన సత్నామీలను పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొన్నది. పోలీసులు లాఠీచార్జీ చేయటంతో రెచ్చిపోయిన ఆం దోళనకారులు ఏకంగా కలెక్టర్ కార్యాలయానికే నిప్పు పెట్టారు. అక్కడ పార్క్ చేసి ఉన్న దాదాపు 200 వాహనాలను ధ్వంసం చేశారు. కొన్నింటికి నిప్పు పెట్టారు.