రాజకీయాలకు కేశినేని నాని గుడ్‌బై
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సం చలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు విజయవాడ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసిన కేశినేని నానిపై ఆయన సోదరుడు కేశినేని చిన్ని ఘన విజ యం సాధించారు. దీంతో రాజకీయాల నుంచి వైదొలగాలని నాని నిర్ణయం తీసుకున్నారు. ‘చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వా త నిర్ణయం ప్రకటించా. ఇక నుంచి నా రాజకీయ ప్రయాణాన్ని ముగించా. విజయవా డపై నా నిబద్దత బలంగానే ఉంది. విజయవాడ అభివృద్ధికి నా వంతు మద్దతు ఇస్తా. నా రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.’ అని నాని పోస్టు చేశారు.






