calender_icon.png 16 July, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వాసికి ఎక్సలెన్స్ ఇన్ లీడర్ షిప్ అవార్డు

16-07-2025 12:43:49 AM

మంచిర్యాల, జూలై 15 (విజయక్రాంతి) : జిల్లాకి చెందిన అడ్వకేట్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ రంగు వేణు కుమార్ ఎక్సలెన్స్ ఇన్ లీడర్ షిప్ అవార్డు అందుకున్నారు. మైండ్ సపోర్ట్ హిప్నోసిస్ అండ్ కౌన్సెలింగ్ సంస్థ ఉప్పల్‌లో నిర్వహించిన ఇప్నోసిస్ అవారడ్స్ - 2025 కార్యక్రమంలో నూతనంగా హిప్నోథెరపీ సేవలు అందిస్తున్న హిప్నోథెరపిస్టుల కు ’కిక్ స్టార్ట్’ అవార్డులను, సమాజ శ్రేయ స్సు కోసం వివిధ రంగాల్లో సేవలను అందిస్తున్న వారికి లీడర్ షిప్ అవారడ్స్ లను అందజేశారు. తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రామ్ చందర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.