సఖీ సెంటర్‌లో అత్యుత్తమ సేవలు
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నోడల్ అధికారి వల్లేటి ప్రేమ్ చంద్
మెదక్, ఏప్రిల్ 30(విజయ క్రాంతి) : సఖి సెంటర్లో బాధితులకు అత్యుత్తమ సేవలు అందాలని, మెదక్ జిల్లాలో అంగన్వాడీల పనితీరు ఆదర్శంగా ఉందనీ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నోడల్ అధికారి వల్లేటి ప్రేమ్ చంద్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలో నిర్వహిస్తున్న సఖి - కేంద్రము. రెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ ను మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నోడల్ అధికారి వల్లేటి ప్రేమ్ చంద్ తనిఖీ చేశారు.
ముందుగా సఖి సెంటర్లో రిజిస్టర్లని తనిఖి చేస్తూ క్లిస్టమైన కేసులను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే మహిళలు పని చేసే చోట కలిగే ఇబ్బంధులని గురించి మహిళలపై లైంగిక దాడి చట్టము పై కూడా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
అనంతరం అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి గర్భిణులు, బాలింతలకు పోషక విలువలున్న ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో తల్లీబిడ్డలకు సంపూర్ణ పోషకాహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, సంబంధిత అంగన్వాడి సిడిపిఓలు, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.






