14 April, 2026 | 4:18 AM

ఇంటర్ ఫలితాల్లో జహ్నవి విద్యార్థుల విశిష్ట ప్రతిభ

14-04-2026 02:03 AM

హైదరాబాద్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): జహ్నవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో విశిష్ట ప్రతిభ కనబరిచి పూర్తి ఉత్తీర్ణత సాధించారు.ఈ సం దర్భంగా జహ్నవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ ఏ. పరమేశ్వర్, వైస్ చైర్‌పర్సన్ ఎ. లక్ష్మి  విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు.

ఈ విజయానికి విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం ముఖ్య కా రణమన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి విజయమే మా లక్ష్యమని వారు పేర్కొన్నారు.