14 April, 2026 | 4:03 AM

ఎన్‌కౌంటర్‌లో రంగబోయిన భాగ్య మృతి

14-04-2026 02:06 AM

నేలకొరిగిన సిద్దిపేట జిల్లా ధర్మారం వాసి

మృతదేహాం స్వగ్రామం వచ్చేలా చూడాలని వేడుకోలు

సిద్దిపేట ఏప్రిల్ 13(విజయక్రాంతి): సచ్చినా, బతికినా ప్రజల కోస మే, నమ్మిన మావో సిద్ధాంతాన్ని వదలబోనని ప్రతిన బూనిన సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ (46) ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేలకొరిగింది.

పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ఏరి యా కమాండర్ భాగ్య మృత్యువాత పడింది. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రా మానికి చెందిన భాగ్య ఆలియాస్ (రూపీ )2004లో సమీప గ్రామమైన పెద్ద గుండెవెళ్లికి చెందిన మావోయిస్టు నేత లక్ష్మీనారా యణ పరిచయంతో మావోయిస్టు పార్టీలో చేరింది.అప్పటినుంచి భాగ్య మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఏరియా క మాండర్ వరకు ఎదిగింది.

ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31 లోపు లొంగిపోవాలని పిలుపునిచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు మావోయిస్టులు మాత్రం లొంగిపోవడానికి నిరాకరించారు. అందులో భాగ్య ఉండడం విశేషం. 2004 ఏడాదిలో దుబ్బాక దళానికి పరిచయమైన భాగ్య గత కొంత కాలంగా ఇందుప్రియాల్, నర్సాపూర్ దళాల్లో పనిచేసింది. ఇక్కడ తీవ్ర నిర్బంధం ఏర్పడడంతో దండకారణ్యానికి వెళ్లింది. అక్కడి నుంచి అభుజ్ మాడ్ లో పని చేసింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కాంకేర్ జి ల్లాలో పార్థాపూర్ ఏరియా కమాండర్ గా పనిచేస్తోంది.

చోటే బేటియా అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఆమె మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. చనిపోయే వరకు ఇంటిముఖం చూడని భాగ్య మరణం ధర్మారం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. భాగ్య కుటుంబ సభ్యులు చివరి చూపుకైనా మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు. తమ బిడ్డ చనిపో యిందని తల్లితోపాటు కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.