04-10-2025 01:31:57 AM
- ఒక్కో వైన్స్ వద్ద రూ.వేల విలువైన మద్యం సీసాల సేకరణ
- బెల్టు షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
- కళ్ళు మూసుకునీ వసూళ్లు చేస్తున్న ఎక్సైజ్, పోలీసు అధికారులు
- గాంధీ సాక్షిగా మందులో మునిగిన గజ్వేల్
గజ్వేల్, అక్టోబర్ 3 : అధికారుల పేరు చెప్పి కొందరు అక్రమాలకు పాల్పడే సందర్భాలు స మాజంలో జరగడం వార్తల్లో వింటుంటాం. కానీ గజ్వేల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో జర్నలిస్టుల పే రు చెప్పి విలువైన మందుబాటిళ్లను ఎక్సైజ్ శాఖ వైన్స్ యజమానుల నుండి తీసుకువెళ్లడం ఆశ్చర్యపరిచింది. దసరా సందర్భంగా గజ్వేల్ ఎక్సైజ్ పరిధిలోని వైన్స్ లలో ఎక్సైజ్ శాఖ సి బ్బంది వేల రూపాయల విలువైన మద్యం సీసాలు జర్నలిస్టులకు ఇవ్వాలి అంటూ తీసుకువెళ్లడం జర్నలిస్టులలో చర్చకు దారి తీసింది. ఒక్కో వైన్స్ లో ఏడు బాటిళ్ల చొప్పున సిబ్బంది సేక రించినట్లు తెలుస్తుంది.
కాగా దసరా పండుగ రోజు గాంధీ జయంతి కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ అన్ని వైన్స్ దుకాణాలను మూసి సీల్ వేసింది. కానీ అంతకుముందే మద్యం దుకాణాల నుండి లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లు బెల్ట్ షాపులకు, వైన్స్ పరిసర ప్రాంతాల్లోని పలు స్థావరాల్లో డంపు చేశారు. దీంతో దసరా పండుగ రోజు మద్యం ఏరులై పారింది. దసరా పండుగ రోజు అధిక ధరలకు బెల్ట్ షాపులతో పాటు మద్యం దుకాణా ల నిర్వాహకులు కూడా మద్యాన్ని మద్యాన్ని విక్రయించినట్లు ప్రజలలో ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
ఓ జర్నలిస్టుకు ఓ మద్యం దుకాణ యజమాని జర్నలిస్టుల పేరు చెప్పి ఒక్కో వైన్స్ నుండి ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది వేల రూపాయల విలువైన ఏడు బాటిల్ల చొప్పున మద్యం సీసాలను సేకరించినట్లు వెల్లడించడంతో జర్నలిస్టులు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో కూడా విలేకరులు కల్తీకల్లు పై వార్తా కథనాలు ప్రచురించిన సందర్భాల్లో సైతం ఎక్సైజ్ అధికారులు సదరు ఈ దుకాణాల వద్ద భారీ స్థాయిలో మామూళ్లు వసూలు చేశారు. మత్తు పదా ర్థాలతో కృత్రిమ కల్లు తయారుచేసి కల్లు దుకాణాల వ్యాపారులు విక్రయిస్తున్నా వారి నుండి నెలనెల మామూలు తీసుకుంటూ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం డ్ర గ్స్ వినియోగం, కల్తీ కల్లు తయారీపై ఉక్కు పాదం మోపుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ పనితీరుపై కూడా ప్రత్యేక నిఘాతో వ్యవహరించాల్సిన పరిస్థితులు గజ్వేల్ ఎక్సైజ్ పరిధిలో చోటు చేసుకున్నాయి. కాగా దసరా సందర్భంగా జర్నలిస్టులకు మద్యం సీసాల పేరుతో వైన్స్ వ్యాపారుల నుండి భారీగా మద్యం సీసాల ను ఎక్సైజ్ అధికారులు సిబ్బంది సేకరించి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి కుటుంబ విందుకు తరలించినట్లు తెలుస్తోంది.