calender_icon.png 4 October, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్‌లో ఈసారీ.. నో జంబ్లింగ్

04-10-2025 01:49:52 AM

  1. జంబ్లింగ్ విధానంతో ప్రైవేట్ కాలేజీలకే లాభం 
  2. ఇంటర్ బోర్డు వాయిదాల పర్వం

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : ప్రాక్టికల్స్‌లోనూ జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తామంటూ ప్రతి ఏటా చెప్పుకుంటూ వస్తున్న ఇంటర్ బోర్డు అధికారులు ఈ విద్యాసంవత్సరం కూడా చేతులెత్తేశారు. జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికి అది అమలుకు నోచు కోవడంలేదు. ఇంటర్ బోర్డు ఈ విషయంలో అలసత్వం వహిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జంబ్లింగ్ విధానంతో ప్రైవేట్ కాలేజీలకే ఎక్కువ గా ఉపయోగం ఉంటుంది. జంబ్లింగ్ లేకపోవడంతో ఏ కాలేజీలోని విద్యార్థికి ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు.

ఈ విధానంతో ప్రైవేట్ కాలే జీల్లోని విద్యార్థులకు లాభం చేకూరుతుంటే, సర్కారు కాలేజీల్లో చదివే విద్యా ర్థులకు మాత్రం నష్టం జరుగుతోంది. జంబ్లింగ్‌లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తే ప్రైవేట్ కంటే కూడా ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులే ఎక్కువగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ పద్ధతిని అమలు చేసేందుకు అధికారులు ఇష్టపడడంలేదు. అంతేకాకుండా ప్రైవేట్ కాలేజీల నుంచి వస్తున్న ఒత్తిడి కూడా ఇందుకు ఒక కారణమే. అందుకే ఈసారి కూడా జంబ్లింగ్ విధానానికి ఇంటర్ బోర్డు అధికారులు దూరంగా ఉన్నారనే చెప్పాలి. ఈ విధానం లేకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు తమ విద్యార్థులకు ఇష్టానుసారం గా ఫుల్ మార్కులు వేసుకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి.