27-10-2025 11:40:12 AM
పటాన్ చెరు: కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామున నుంచే ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. కార్తీక మాసం(Karthika Masam) ప్రారంభమైన నేపథ్యంలో శివాలయాలను భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కార్తీక మాసంలో వచ్చిన మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామున నుంచే ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. కార్తీక సోమవారం పవిత్ర దినం గా భావించిన భక్తులు ఉదయాన్నే స్నానం చేసి, భక్తి భావంతో శివాలయాలు, దర్శించుకున్నారు.
ప్రత్యేకంగా అమీన్ పూర్, బీరంగూడ శ్రీశ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, గుమ్మడిదల, బొంతపల్లి శ్రీ శ్రీ మహంకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి శివాలయాల్లో భారీగా భక్తులు తాకిడి ఎక్కువవుతోంది. అలాగే ఇస్నాపూర్, గణేష్ గడ్డ, ఇంద్రేశం అన్ని దేవాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కుటుంబ సమేతంగా ఆలయాలకు వచ్చిన భక్తులు పరమేశ్వరునికి పాలు, తేనె, బెల్లం, నీరు, బిల్వదళాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతతో నిండిన కార్తీక సోమవారం ప్రజలతో ఉత్సాహంగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఆలయల చైర్మన్ లు సుధాకర్ యాదవ్ , ప్రతాపరెడ్డి మాట్లాడుతూ... కార్తీక మొదటి సోమవారం కావడంతో వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు.