27-10-2025 11:41:50 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్:(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరికేపల్లి గ్రామంలో సోమవారం 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరులు ప్రజల భద్రత కోసం ప్రాణాలను అర్పించారని వారి త్యాగాన్ని స్మరించుకుంటూ, సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.పోలీసు శాఖ కేవలం చట్టం అమలు చేయడమే కాకుండా, ప్రజల మధ్య సానుభూతిని పెంచే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.