calender_icon.png 26 May, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా ఉల్లాసంగా వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్

26-05-2025 12:13:42 AM

నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్‌లో వింధ్య గోల్డ్ సిల్వర్ బార్ ఛాలెంజ్‌కు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఈషా రెబ్బా హాజరై సందడి చేసింది. ఈ ఛాలెంజ్ ప్రోగ్రామ్ మే 23 నుంచి 25వ తేదీ వరరకు కొనసాగింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ.. “బంగారంలాంటి వేడుక ఇది. ఈవెంట్ చాలా గ్రాండ్‌గా కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ తరహా వినూత్న ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి మరిచిపోలేని అనుభూతి నిస్తాయి.

వింధ్య గోల్డ్ వంటి నమ్మకమైన బ్రాండ్ నిర్వహిస్తుండటంతో మరింత విశ్వసనీ యంగా అనిపిస్తోంది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్తుకు బంగారు భరోసా లాంటిది” అన్నారు. గోల్డ్ సిల్వర్ ఛాలెంజ్‌లో సందర్శకులతోపాటు ఈషా రెబ్బా సందడి చేసి ఉ త్సాహపరిచారు.

ఈ గోల్డ్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ అదృ ష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆద్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన ఈ ఛాలెంజ్‌లో విజేతలకు బంగా రు, వెండి నాణేలు బహుమతులుగా అందజేశారు.