calender_icon.png 28 May, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేన్స్‌లో గూచి చీరలో..

26-05-2025 12:15:15 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరిగింది. ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరం వేదికగా ఈ నెల 13న మొదలైన ఈ చలన చిత్రోత్సవం శనివారంతో ముగిసింది. మన దేశం తరఫున పలువురు సుందరీమణులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఖరీదైన దుస్తులు ధరించి, రెడ్ కార్పెట్‌పై హొయలుపోయారు. ముగింపు రోజు బాలీవుడ్ నటి అలియాభట్ సూపర్ లుక్‌లో అదరగొట్టారు. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గూచి సిద్ధం చేసిన చీర ధరించిన ఆమె రెడ్ కార్పెట్‌పై ఫొటోలకు ఫోజులిచ్చింది.

అయితే అలియా కేన్స్‌లో సందడి చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. తొలిరోజు ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఫ్లోరల్ గౌనుతో ఆమె వేడుకల్లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘హలో కేన్స్’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక చివరి రోజు ఆమె గూచి బ్రాండ్ సిద్ధం చేసిన తొలి చీరలో తళుక్కున మెరిసింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. గూచి చీరలో అలియా అందాలను ఆస్వాదిస్తున్న ఫ్యాషన్ ప్రియులు వావ్ అంటూ ఫిదా అవుతున్నారు.