calender_icon.png 26 May, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా సినిమాలెప్పడూ ఒకే జానర్, ఒకే బ్యాక్‌డ్రాప్‌లో ఉండవు

26-05-2025 12:12:05 AM

గుణ హ్యాండ్ మేడ్ ఫిలమ్స్ బ్యానర్ మీద దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘యుఫోరియా’. నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గుణశేఖర్ దీన్ని నూతన నటీనటులతో ఓ ట్రెండీ టాపిక్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికారెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాశ్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు ముఖ్య పాత్రల్ని పోషించారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఫ్లై హై’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘ఆడియెన్స్ చూపించే ఎనర్జీయే ‘యుఫోరియా’. ఇదే ఎనర్జీ సినిమాలోనూ ఉంటుంది. ఈ ‘ఫ్లై హై’లానే ఇంకో మూడు పాటలు ఉంటాయి. అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కంప్లీట్ యూత్ ఫుల్ బ్యాక్ డ్రాప్తో ఈ మూవీని తీస్తున్నాను.

నేను ఎప్పుడు ఏ సినిమా చేసినా ఒకే జానర్, ఒకే బ్యాక్ డ్రాప్లో ఉండవు. నాకు నచ్చిన కథల్ని ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూనే వచ్చాను. ఈ ‘యుఫోరియా’ కథను నేను, నా ఫ్యామిలీ చాలా నమ్మింది. అందుకే నేను ఈ మూవీని తీశాను‘ అన్నారు. నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ.. ‘అందరికీ మా ఫస్ట్ సింగిల్ ‘ఫ్లై హై’ నచ్చిందని భావిస్తున్నా.

ఇంత మంచి పాటను ఇచ్చిన కాళ భైరవకు థాంక్స్’ అని తెలిపారు. కాళ భైరవ మాట్లాడుతూ.. “ఫ్లై హై’ పాట అందరికీ నచ్చుతుందని నేను కాన్ఫిడెంట్గా చెబుతున్నాను. ఇది అన్ని సినిమాల్లా నార్మల్గా ఉండదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే నేను కూడా చాలా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ట్రై చేశాను’ అని చెప్పారు.