రూ.2500 స్కీంపై కసరత్తు
ప్రణాళికల పనిలో అధికారులు
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం వీటిలో ఒక్కొక్కటి అమలు చేస్తుండగా మరి కొన్నింటిని అమలు చేసేందుకు అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. మ్యానిఫె స్టోలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో మహిళల ఖాతాలో ప్రతి నెలా రూ. 2500 వేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్‌ను వచ్చే జూలై నుంచి పార్రంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్‌లో నెలనెలా రూ.2500 జమ కానున్నాయి.
ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్ పొందని కుటుంబా ల్లో మహిళలు మాత్రమే నగదు పొందనున్నారు. దరఖాస్తుదారు తప్పనిసరిగా తెలంగాణకు చెందిన వారై ఉండాలి, బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండా లి, ఒక కుటుంబం నుంచి ఒక మహిళకు మాత్రమే పథకం దక్కే అవకాశం ఉంటుందని, రూ.౨ లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలనే నిబంధనలు రూపొందించినట్లు తెలిసింది. ఇక మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళా సంఘాల సభ్యులకు యూనిఫామ్ ల కుట్టుపని అప్పగించిన సర్కారు.. మహిళా శక్తి పథ కం కింద క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ, కార్పొరేషన్ కేంద్రాలతోపాటు, బస్టాండ్‌లు, జాతీయ రహదారుల సమీపంలో వీటిని ఏర్పాటు చేయనుంది. తొలి విడతో 151 క్యాంటీన్‌ల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.






