1 August, 2026 | 2:57 AM

నిరుద్యోగులను మోసం చేస్తున్న సర్కార్

23-06-2024 01:22 AM

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.. నిరుద్యోగ భృతి ఇవ్వాలి

సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి):  నమ్మి ఓటు వేసి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే, ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. ఈ శనివారం ఈ మేరకు గ్రూప్స్ పరీక్షలతోపాటు నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్‌రెడ్డికి బహి రంగ లేఖ రాశారు.  గ్రూప్ 1 మెయిన్స్‌కు 1: 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు.  గ్రూప్  గ్రూప్  పోస్టులను మరిన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.  నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశాల్లో ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయని ఆశించామని, కానీ అది జరగలేదన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో వివిధ శాఖల్లో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, యువత కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మా రన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడిచినా, తమ ప్రభుత్వ హయాంలో కొలువులు సాధించిన వారికి నియామక పత్రాలు ఇవ్వడమే సరిపోతుందన్నారు.