14 July, 2026 | 3:10 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

ఐపీఎల్ కోసం రిటర్మైంట్

03-04-2026 12:36 AM

సొంతబోర్డుపై కోర్టుకెళ్లిన తుషారా

కొలంబో, ఏప్రిల్ 2 : ఐపీఎల్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కే కాదు క్రికెటర్లకు కూడా ఎంతో క్రేజ్. ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే అంతర్జాతీయ షెడ్యూల్ లేదా ఫిట్‌నెస్ సమస్యలతో పలు దేశాల క్రికెట్ బోర్డులు విదేశీ ప్లేయర్స్‌కు ఎన్‌వోసీ ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి.

తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్ళకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించి ఫిట్‌గా ఉంటేనే ఐపీఎల్ ఆడేందుకు అనుమతిచ్చింది. అయితే ఎన్‌వోసీ ఇవ్వలేదంటూ లంక క్రికెటర్ నువాన్ తుషారా కోర్టు మెట్లెక్కాడు. తాను ఫిట్‌గా ఉన్నా ఐపీఎల్ ఆడేందుకు అనుమతించడం లేదని పి టిషన్ దాఖలు చేశాడు. కొలంబో కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.

అదే సమయంలో అతడు రిటైర్మెంట్ ఆలోచన లో కూడా ఉన్నాడు. తన కాంట్రాక్ట్ పునరుద్ధరించొద్దని కూడా బోర్డుకు ముందే చెప్పి నా ఎన్‌వోసీ ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీని ప్రకారం చూస్తే ఐపీఎల్ కోసమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు అర్థమవుతోంది.