25 March, 2026 | 2:11 AM

రోబోటిక్ శస్త్రచికిత్సల విస్తరణ

25-03-2026 12:00 AM

క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్, ఇంట్యూటివ్ మధ్య ఒప్పందం

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాం తి): ఆధునిక వైద్య సేవలను దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా, ప్రముఖ ఆరోగ్య సేవా సంస్థ క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్, మినిమల్లీ ఇన్వాసివ్ కేర్‌లో ప్రపంచ స్థాయి టెక్నాలజీ సంస్థ ఇంట్యూటివ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

ఈ ఒప్పందం ద్వారా కేర్ హాస్పిటల్స్, కిమ్‌హెల్త్, ఎవర్‌కేర్ హాస్పిటల్స్ నెట్వర్క్‌ల్లో రోబోటిక్ సహాయంతో చేసే శస్త్రచికిత్స సేవలను దశల వారీగా విస్తరించనున్నారు. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లోని రోగులకు ఈ అధునాతన చికిత్స అందుబాటు లోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యం. కొత్త కేంద్రాల్లో రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి రావడంతో వైద్య సేవల నాణ్యత మెరుగుపడటంతో పాటు, ప్రాంతాల మధ్య ఉన్న వైద్య సేవల తేడా తగ్గే అవకాశం ఉంది.

థొరాసిక్, ట్రాన్స్ప్లాంట్, యూరాలజీ, గైనకాలజీ, జనరల్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ వంటి పలు విభాగాల్లో ఈ సేవలు అందించనున్నారు. క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ.. రోబోటిక్ శస్త్రచికిత్సను విస్తరించడానికి సుస్థిరమైన, ప్రణాళికాబద్ధమైన విధానం అవసరం. టైర్ 2, టైర్ 3 ప్రాంతాల్లోకి విస్తరిస్తున్న నేపథ్యంలో, రోగులు తమ ప్రాంతాల్లోనే అధునాతన చికిత్స పొందేలా వైద్య బృందాల సామర్థ్యాన్ని పెంపొందిస్తున్నాం. దేశవ్యాప్తంగా సమానమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించడమే మా లక్ష్యం అని తెలిపారు. 

ఇంట్యూటివ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ మేనేజర్ రోహిత్ మహాజన్ మాట్లాడుతూ.. క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ తో భాగస్వామ్యం మాకు ఆనందంగా ఉంది. ఈ సహకారం ద్వారా మరింత మంది రోగులకు ఆధునిక మినిమల్లీ ఇన్వాసివ్ చికిత్స అందించగలుగుతాం అన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, ఇంట్యూటివ్ సంస్థ క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ ఆసుపత్రుల్లోని సర్జన్లు, వైద్య బృందాలకు సమగ్ర సాంకేతిక శిక్షణతో పాటు నిరంతర సేవా మద్దతు అందించనుంది. 

దీంతో ప్రోగ్రామ్ అమలు మరింత సమర్థవంతంగా, స్థిరంగా సాగుతుంది. శస్త్రచి కిత్సల్లో ఖచ్చితత్వం పెరగడంతో పాటు రోగుల కోలుకునే వేగం కూడా మెరుగుపడనుందని తెలిపారు.