మంత్రిని కలిసిన భూ నిర్వాసితులు
11-06-2024 02:17 AM
గజ్వేల్, జూన్ 10: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుడాట్‌పల్లి, చిన్న కోడూరు, మామిడ్యాల, బహిలంపూర్, థానేదార్‌పల్లి గ్రామాల భూ నిర్వాసితులు సోమవారం రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు. పరిహారం ఇవ్వకుండా కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులలో భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరారు. గ్రామాన్ని నిర్మించి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని విన్నవించారు. ప్లాట్లు, ఇళ్లు ఇవ్వాలని, పరిహారం రానివారికి పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఒంటరి మహిళలకు, పురుషులకు కోర్టు ఉత్తర్వుల మేరకు పూర్తి ప్యాకేజీ ఇవ్వాలని, ప్రాజెక్టు కోసం వాడనటువంటి భూములు తిరిగి రైతులకు ఇవ్వాలని కోరారు.






