6 July, 2026 | 11:59 PM

తమ్ముడిని కొట్టి చంపిన అన్న

11-06-2024 02:19 AM

ఎల్బీనగర్, జూన్ 12 : అన్న చేసి న దాడిలో తీవ్రంగా గాయపడి  తమ్ముడు మృతి చెందాడు.  పోలీసుల కథనం ప్రకారం..  హయత్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునగనూరు గ్రామం వెం కటేశ్వరకాలనీలో ముద్దంగుల కృష్ణ (35) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడి అన్న ముద్దంగుల రాములు(40) సైతం అదే కాలనీలో ఉంటున్నాడు. కొంతకాలంగా అన్నదమ్ముళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో మే 13 న రాములు, అతని కుమారుడు బా లుతో కలిసి తమ్ముడి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిపై కృష్ణ పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్ట గా, రాములుకు రూ.4 వేల జరిమా నా విధించారు. జరిమానా విషయంలో వారం రోజుల క్రితం మళ్లీ గొడవపడ్డారు. ఈ క్రమంలో రా ములు, బాలు మరో వ్యక్తితో వచ్చి ఆదివారం రాత్రి కృష్ణ ఇంటిపై దాడి చేసి పరారయ్యారు. గాయపడిన కృ ష్ణను ఉస్మానియా దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భా ర్య జ్యోతి హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.