7 July, 2026 | 1:48 AM

మాజీ ప్రధాని పీవీపై ప్రత్యేక సంచిక

11-06-2024 02:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి) : మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు సాహిత్యంపై తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రత్యేక సంచికను విడుదల చేసింది. తెలం గాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నడిచే పునాస ఏప్రిల్‌ె జూన్ మాస ప్రత్యేక సంచికలో పీవీ నరసింహారావు సాహిత్యంపై కథనాలు ప్రచురించారు. ఈ సంచికను అకాడమీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సో మవారం ఆవిష్కరించారు. కార్య క్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామో జు బాలాచారి, సంపాదకవర్గ సభ్యులు డాక్ట ర్ రాపోలు సుదర్శన్, ఇతర సాహితీవేత్తలు పాల్గొన్నారు.