28 May, 2026 | 1:39 AM

ధాన్యం తరలింపు వేగవంతం చేయండి

28-05-2026 12:59 AM

అదనపు లారీలు, ట్రాక్టర్లతో తడిసిన ధాన్యాన్ని పారా బాయిల్ మిల్లులకు తరలింపు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా

మహబూబ్ నగర్, మే 27 (విజయక్రాంతి): ధాన్యం తరలింపు ప్రక్రియను మరింత వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల పరిధిలో సుమారు 564 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచినట్లు సమాచారం అందిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి, సహకార, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.