26 March, 2026 | 2:53 AM

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఖరీదైన వైద్యం

26-03-2026 12:00 AM

పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట, మార్చి 25 (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద ప్రజలకు ఖరీదైన వైద్యం అందుతుంది అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 24 మందికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన రూ.9,26,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 నెలలో మా తరఫున 98 మంది లబ్ధిదారులకు దాదాపు 40,25,500 రూపాయలు అందించామన్నారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద రూ.1000 కోట్లకు పైగా నిధులను మంజూరు చేశారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజలకు ఒక వరం లాగా మారిందన్నారు.

పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ అర్హులకు అందిస్తామన్నారు. చెక్కుల పంపిణీకి సహకరించిన ఎంపీ రఘువీర్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కౌన్సిలర్ కొనతం రాజేష్ రెడ్డి, జ్యోతి కరుణాకర్, వల్దాస్ దేవేందర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.