24 August, 2026 | 11:12 AM

ప్రమాణ స్వీకారం ముగిసాక వచ్చిన ప్రత్తిపాటి.. అసలు ఏం జరిగింది?

12-06-2024 05:37 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవ సభకు వేలాదిగా జనం తరలిరావడంలో జాతీయ రహదారిపై వాహనాలు కిక్కిరిసి పోయాయి. చిలకలూరిపేట ఎంఎల్ఎ ప్రత్తిపాటి పుల్లారావు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. దీంతో ఆయన ఆ ట్రాఫిక్ మధ్యలో నుంచి సభ ప్రాంగణానికి తన వామనం వదిలి కార్యకర్తల స్కూటీపై ప్రమాణ స్వీకారానికి వచ్చారు. అప్పటికే చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకార ఘట్టం ముగిసింది. దీంతో అందరికీ శుభాకాంక్షులు తెలిపి వెనుదిరిగారు