పాలీసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
23-04-2024 12:56 AM
n ఈ నెల 28 వరకు అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్ దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగించారు. ఈ నెల 28 వరకు పొడిగిస్తూ అధికారులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం సోమవారంతో గడువు ముగిసినా విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు మరో ఆరు రోజులు పొడిగించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు, రూ.300తో మే 20 వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మే 24న పాలీసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.






