16 July, 2026 | 2:50 AM

వెబ్‌సైట్‌లో కేవీ విద్యార్థుల లాటరీ వివరాలు

23-04-2024 12:59 AM

2024 విద్యా సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయాలలో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచా రు. ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు లాట రీ ప్రక్రియను నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేశారు. అధికారిక వెబ్ సైట్‌లో లాగిన్ కోడ్‌తో ఎంటర్ అ యితే ఎంపిక చేసుకున్న మూడు కేవీల్లో లాటరీ నంబర్‌తో పాటు పాఠశాలల వారీగా వెయిటింగ్ లిస్టు వివరాలను పొందుపరిచారు. అయి తే ఈ వివరాలు లాటరీ తర్వాత అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారం మాత్రమేనని, పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్ధారణ మాత్రం కాదని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) పేర్కొంది.